OG : కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ .. బీట్స్‌తో దుమ్ములేపారుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ మాస్ బీట్ సాంగ్ కూడా యాడ్ చేశారు. అందాల భామ నేహా శెట్టి తనదైన స్టెప్పులతో ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక థమన్ మరోసారి తన బీట్స్‌తో ఈ పాటను కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకుంది.

ఈ పాటను ఇటీవల సినిమాలో యాడ్ చేయగా, థియేటర్లలో ఈ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఇప్పుడు లిరికల్ సాంగ్ బయటకు రావడంతో ఈ పాటను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version