ఇంట్రెస్టింగ్.. గ్లింప్స్ తో రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

The-Girlfriend

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇపుడు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆమె నుంచి ఈ అక్టోబర్ లోనే ఓ బాలీవుడ్ సినిమా వస్తుండగా దీని తర్వాత కొంత గ్యాప్ లోనే మళ్ళీ మరో సినిమా వచ్చేందుకు సిద్ధం అయ్యింది. నటుడు అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఆ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”.

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో యంగ్ నటుడు దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ తో అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ గ్లింప్స్ తో రాహుల్ రవీంద్రన్ ఒక ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ ని రష్మికతో చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లీడ్ జంట మధ్య సన్నివేశాలు, మరింత ఆసక్తిగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ టీజర్ లో మూడ్ కి తగ్గట్టుగా హీశం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన స్కోర్ కూడా సాలిడ్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమాని మేకర్స్ ఈ నవంబర్ 7న థియేటర్స్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో రిలీజ్ కి రాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version