మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. సాలిడ్ అడ్వెంచరస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తేజ సజ్జ కెరీర్లో హను మాన్ తర్వాత మరో భారీ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఇప్పటికీ మంచి రన్ ని కొనసాగిస్తుండగా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది. ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో తెలుగు, తమిళ్ ఇంకా కన్నడ, మలయాళ భాషలు తాలూకా స్ట్రీమింగ్ డేట్ ని ఇపుడు హాట్ స్టార్ వారు అనౌన్స్ చేసేసారు.
దీనితో మిరాయ్ చిత్రం ఈ అక్టోబర్ 10 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.