కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్ లో హైప్ తో మంచి బుకింగ్స్ అండ్ వసూళ్ళని రాబడుతుంది. అలా నైజాం మార్కెట్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అక్కడ వసూళ్లు అదరగొట్టింది.
ఇంకా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లే ఈ చిత్రానికి ఎక్కువగా ఉండడం విశేషం. మొదటి రోజు అక్కడ 3.8 కోట్ల షేర్ ని అందుకుంటే రెండో రోజుకి 3.9 కోట్ల షేర్ (జీ ఎస్ టీ కాకుండా) అందుకోవడం విశేషం. దీనితో సాలిడ్ వీకెండ్ పై సినిమా కన్నేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.