ఈ ఏడాదిలోనే మన సౌత్ నుంచి పలువురు హీరోస్ నుంచి రెండు సినిమాలు వచ్చినవి కూడా ఉన్నాయి. అలా ధనుష్ కూడా తన నుంచి కుబేర లేటెస్ట్ గా ఇడ్లీ కొట్టు రెండు సినిమాలు రిలీజ్ చేయగా ఈ సినిమా కాకుండా ఈ ఏడాదిలోనే తన నుంచి మూడో సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది. అదే తన మరో బాలీవుడ్ చిత్రం “తేరే ఇష్క్ మైన్”.
ఈ చిత్రం నవంబర్ లో రిలీజ్ కి సిద్ధం అయితే ఈ సినిమా కాకుండా మరో రెండు నెలల్లోనే ఇంకో సినిమా ధనుష్ రిలీజ్ కి తీసుకొచ్చేస్తున్నాడు. తన కెరీర్ 54వ సినిమాగా దర్శకుడు దర్శకుడు విగ్నేష్ రాజాతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా షూటింగ్ లేటెస్ట్ గానే పూర్తి కావడంతోనే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిందట. దీనితో ధనుష్ తన సినిమాలతో ఏ రేంజ్ స్పీడ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.