కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నిత్య మీనన్, షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ నే దర్శకత్వంలో తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రమే “ఇడ్లీ కడై”. తెలుగులో ఇడ్లీ కొట్టు గా రిలీజ్ అయ్యిన ఈ సినిమా మంచి ఎమోషన్స్ తో డీసెంట్ డే 1 ని తెలుగులో అందుకుంది. కానీ తెలుగు కంటే తమిళ్ లో ఈ సినిమా బాగా పెర్ఫామ్ చేస్తుందని తెలుస్తుంది.
డే 1 కే తమిళ నాట 11 కోట్ల మేర గ్రాస్ వస్తే ఇపుడు డే 2 కి మరింత బెటర్ వసూళ్లు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఇడ్లీ కడై తమిళ్ వెర్షన్ లో మాత్రం మంచి రన్ నే చూసేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా ఆకాష్ బాస్కరన్, ధనుష్ లు నిర్మాణం వహించారు. అలాగే అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.