‘కాంతార 1’.. మరోసారి రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్ కి జనం ఫిదా

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘కాంతార 1’. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి నటించిన ఈ సెన్సేషనల్ డివోషనల్ డ్రామా హైప్ ని అందుకుని అంతకుమించి పెర్ఫామ్ చేస్తుంది. అయితే దీనికి ముందు వచ్చిన మొదటి సినిమాని హీరో రిషబ్ శెట్టి ఏ రకంగా అయితే తన పెర్ఫామెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడో ఈసారి పార్ట్ 1 కి కూడా అదే రీతిలో చూసిన ఆడియెన్స్ నుంచి స్పందన వస్తుండడం విశేషం.

సినిమాలో కంటెంట్ తో పాటుగా రిషబ్ శెట్టి మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ తో తన నటన అమోఘం అని కొనియాడుతున్నారు కూడా. ఇలా మొత్తానికి ఈ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలకి కూడా రిషబ్ శెట్టి తనతో ఆడియెన్స్ మనసులు దోచుకున్నాడని చెప్పవచ్చు. ఇక కాంతార 1 ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version