డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా.. డేట్ ఫిక్స్

chiranjeeva

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “చిరంజీవ”. గత ఏడాదిలోనే తన నుంచి మూడు సినిమాలు వరుసగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాల తర్వాత తన నెక్స్ట్ సినిమా మాత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు అభినయ కృష్ణ తెరకెక్కించగా ఓ ఇంట్రెస్టింగ్ ఫన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టుగా ఈ టీజర్ ని చూస్తే అనిపిస్తుంది.

ఇక ఈ ఫన్ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ఇది వరకే తమ ఒరిజినల్ చిత్రంగా అనౌన్స్ చేశారు. ఇక అందులో ఈ చిత్రం నేరుగా రిలీజ్ కి డేట్ తో సిద్ధం అయ్యింది. ఈ సినిమాని ఆహా వారు ఈ రానున్న నవంబర్ 7 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కుషిత కళ్లపు హీరోయిన్ గా నటించగా అచ్చు సంగీతం అందించాడు. అలాగే రాహుల్, సుహాసిని నిర్మాణం వహించారు.

Exit mobile version