పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఇంప్రెస్ చేస్తున్న ‘అఖండ 2 తాండవం’

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2 తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సాలిడ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య అఖండగా తాండవం చేస్తూ కనిపించాడు. ఆయన ఉగ్రరూపాన్ని చూపిస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version