లిటిల్ హార్ట్స్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్..!

Little Hearts

మౌళి, శివాని నగరం జంటగా నటించిన సూపర్‌హిట్ మూవీ “లిటిల్ హార్ట్స్” ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో కొన్ని అదనపు సీన్స్‌తో పాటు ఒక పెద్ద సర్ప్రైజ్‌ను ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. “లిటిల్ హార్ట్స్ 2” పేరుతో వచ్చే ఈ సినిమా కథ, లీడ్ పెయిర్ సిబ్లింగ్స్ లవ్ ట్రాక్ చుట్టూ తిరగనుంది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

మొదటి భాగంలో మౌళి తమ్ముడి పాత్ర పోషించిన దర్శకుడు సాయి మార్తాండ్, ఈసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్‌గా ధీరా రెడ్డి ఎంపికయ్యారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

Exit mobile version