మరో మైలురాయిని చేరిన ‘మిరాయ్’

Mirai Movie

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఫాంటసీ యాక్షన్ – అడ్వెంచర్ ‘మిరాయ్’ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను అందుకుని దూసుకుపోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కాగా, థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన OG కూడా మాసివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. అయితే, మిరాయ్ మాత్రం తన జోరును ఇంకా కొనసాగిస్తోంది.

ఈ సినిమా తాజాగా వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో తేజ సజ్జా తన కెరీర్‌లో మరో మైలురాయిని ఈ సినిమా ద్వారా అందుకున్నాడు. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 3 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.

మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version