పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘OG’ మొదటి వీకెండ్లో వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే, పవన్ కళ్యాణ్ తన చిన్న వయసు పాత్రలో ఆయన కుమారుడు అఖీరా నందన్ ఎందుకు నటించలేదనే ప్రశ్న అభిమానుల్లో వచ్చింది. ఆ పాత్రను పోషించిన నటుడు ఆకాష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అఖీరా నందన్‌తో పొడవు భిన్నంగా ఉండడం వల్ల కంటిన్యువిటీ ఇబ్బంది తలెత్తుతుందని, అందుకే సుజీత్ తనను ఎంపిక చేశారని వివరించాడు.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించాడు.