మెగా అప్డేట్స్‌ను పట్టుకొస్తున్న ‘శంకర వరప్రసాద్ గారు’

Mana Shankara Vara Pasad Garu
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మెగా అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మెగా అప్డేట్స్ ఏమిటనేవి అక్టోబర్ 1న తెలియనున్నాయి. ఇక ఈ అప్డేట్స్ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. తమ అభిమాన హీరో సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయా అని వారు ఆతృతగా చూస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

Exit mobile version