వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయ్యిన ‘కుబేర’

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా, కింగ్ నాగార్జున ముఖ్య పాత్రల్లో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రమే “కుబేర”. ధనుష్ కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే బాగా రాణించింది. మరి ఇలా థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా తర్వాత ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇపుడు థియేటర్, ఓటిటి తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు స్టార్ మా సంస్థ తీసుకోగా ఇపుడు వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీనితో కుబేర చిత్రం ఈ అక్టోబర్ 5 సాయంత్రం ఐదున్నర సమయంలో ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాకి బుల్లితెర మీద ఎలాంటి రేటింగ్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి ఇంకా అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version