పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో వాటిని మరింత పెంచుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఇందులో పూర్తి క్రెడిట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మారుతీకే దక్కుతుంది అని చెప్పవచ్చు.
ఈ సినిమా పట్ల నిజానికి మొదట్లో ప్రభాస్ కెరీర్ అన్ని సినిమాల్లో తక్కువ అంచనాలు ప్రభాస్ అభిమానులు పెట్టుకున్నారు. నిజానికి అంతకు మించే హర్ట్ చేశారు కూడా.. కానీ వీటి అన్నిటికీ దర్శకుడు మారుతీ అండ్ టీం కేవలం తమ వర్క్ అండ్ అవుట్ పుట్ తోనే సమాధానం అందించారు అని చెప్పడంలో డౌట్ లేదు.
మొదటి నుంచీ వచ్చిన కంటెంట్ అంతా వేరు నిన్న వచ్చిన ట్రైలర్ ఒక్కటి మాత్రం వేరు అని చెప్పాలి. ఇది వరకు వచ్చిన టీజరే దాదాపు 2 నిమిషాల పైనే కట్ చేశారు. అలాంటిది ట్రైలర్ లో ఏం కొత్తదనం ఉంటుందిలే అనుకున్న ప్రతీ ఒక్కరినీ మారుతీ తప్పని ప్రూవ్ చేసి చూపించారు.
ఒక పక్క కంటెంట్, ఇంకో పక్క ప్రభాస్ ని ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చెయ్యడం ఇంకో పక్క షాకింగ్ విజువల్ ఫీస్ట్, మరో పక్క థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇలా కంప్లీట్ ప్యాకెడ్ గా చూపించి ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా తమ హీరోని ఇలా కదా చూడాలి అనుకున్నాం అనే రేంజ్ లోకి అభిమానుల అభిప్రాయాన్ని మార్చిన క్రెడిట్ మాత్రం మారుతికే దక్కుతుంది. ఈ ఒక్క ట్రైలర్ దెబ్బతో మాత్రం మారుతీ మొత్తం కాలిక్యులేషన్స్ ని మార్చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.