రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే, ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ హీరో సినిమాకు పోటీగా రాకూడదని మేకర్స్ భావిస్తున్నారట.
పాన్ ఇండియా చిత్రంగా ది రాజా సాబ్ పలు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, తమిళంలో అదే రోజున స్టార్ హీరో థళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కూడా విడుదల కావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ ఏర్పడింది. అయితే, తమిళ్లో ప్రత్యక్ష పోటీని తప్పించేందుకు నిర్మాతలు ‘ది రాజా సాబ్’ డబ్బింగ్ వెర్షన్‌ను ఒకరోజు ఆలస్యంగా జనవరి 10న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీంతో విజయ్ లాస్ట్ చిత్రానికి గౌరవ సూచకంగా రాజా సాబ్ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇక రాజా సాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.