పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ గత గురువారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రం విడుదల రోజు నుండే పాజిటివ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఓపెనింగ్ రోజున సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో తన జోరు కొనసాగించింది.
తాజాగా చిత్రబృందం ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా లాంగ్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.252 కోట్ల వసూళ్లు సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ కలెక్షన్లలో ఒకటిగా నిలిచి, ఆయన బాక్సాఫీస్ పవర్‌ను మరోసారి రుజువు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ ఆశిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.