తమిళ సినీ ప్రముఖలలో ఒకరైన మనివన్నన్ నేడు తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్వాసను అందుకోలేక చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఈయన తమిళంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సుపరిచితుడు. 1954లో కోయంబత్తూర్లో జన్మించారు. ఈయన వయస్సు 58సంవత్సారాలు. సత్యరాజ్ ప్రముఖ నటుడు సత్యరాజ్ కు స్నేహితుడైన ఈయన దాదాపు 30ఏళ్ళగా 400 పైగా సినిమాలో నటించారు. అంతేకాక 40 పైచిలుకు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 25 సినిమాలలో సత్యరాజ్ నటించడం విశేషం. అంతేకాక 2006లో జరిగిన ఎన్నికలలో బి.జే.పి పార్టీకు సపోర్ట్ చేసారు. ఈయన నటించిన ‘భామనే సత్యభామనే’, ‘ప్రేమికుల రోజు’, ‘నరసింహ’ సినిమాలోని పాత్రలను తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆయన ఆత్మా శాంతించాలని కోరుకుంటూ 123తెలుగు ద్వారా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాం