క్రేజీ క్లిక్: ‘ఓజి’ సెట్స్ లో సుజీత్ వెనుకున్న పవర్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సొంతం చేసుకొని రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ అందుకొని అదరగొట్టింది. అయితే ఈ సినిమా సక్సెస్ ని మేకర్స్ సహా అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా మేకర్స్ సినిమా సెట్స్ నుంచి పవర్ఫుల్ పిక్ ని షేర్ చేసుకున్నారు.

మరి ఇందులో ముంబై షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి సుజీత్ కనిపిస్తున్న క్రేజీ క్లిక్ ఇది. మరి ఇందులో ముందున నిలబడి సుజీత్ సీన్ వివరిస్తుండగా తన వెనుక బ్లర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. దీనితో ఈ క్లిక్ చూసిన అభిమానులు మరోసారి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version