దే’వర’ 2 కోసం సిద్ధం కండి!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో చేసిన సాలిడ్ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి గత ఏడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఇలా దేవర వార్షికోత్సవాన్ని చిత్ర యూనిట్ సహా అభిమానులు సోషల్ మీడియాలో సందడిగా జరుపుకుంటున్నారు. మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్ దే’వర’ 2 ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ ఏడాది పూర్తయ్యిన సందర్భంగా దేవర 2 కోసం సిద్ధం కండి అంటూ సాలిడ్ అప్డేట్ ని తారక్ పై పోస్టర్ తో అందించారు. మరి ఇందులో వర స్టోరీ హైలైట్ గా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఇలా టైటిల్ లో కూడా తన పేరుని హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో పార్ట్ 2 ని పెట్టారు. సో దేవర 2 అతి త్వరలోనే మొదలు కానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version