ఓజీ టికెట్ రేట్ల వివాదం.. నిర్మాత కౌంటర్ మామూలుగా లేదుగా..!

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు ఇటీవల తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ ఆర్డర్‌పై బర్ల మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో, OG నిర్మాతలు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక అప్‌డేట్‌ను షేర్ చేయడంతో పాటు, పిటిషనర్‌పై సరదాగా వ్యంగ్యాస్త్రాలు కూడా వదిలారు. సోషల్ మీడియాలో వారు.. “తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు టికెట్ రేట్ల పెంపు జీవోను కేవలం పిటిషనర్ బర్ల మల్లేశ్ యాదవ్ గారికి మాత్రమే వర్తించేలా సస్పెండ్ చేశాయి. అందుకే మేము ఆయనకి నైజాంలోని ఏ థియేటర్‌లోనైనా టికెట్‌పై రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నాం.. మల్లేశ్ గారు, మా అభిమానుల్లాగే మీరు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు.

ఈ కేసుపై వచ్చే విచారణ అక్టోబర్ 9న జరగనుంది. ఇకపై తెలంగాణలో రానున్న పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండదని కొన్ని వార్తలు వినిపిస్తున్నా, నిజంగా పెంపులు ఉంటాయా లేదా అన్నది కాలమే చెబుతుంది.

Exit mobile version