టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ హైప్ నడుమ వచ్చి ఇపుడు దుమ్ము లేపుతుంది. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్స్ లో సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ వర్క్ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ ని తాను కెమెరా వర్క్ తో చూపించిన విధానం థియేటర్లులో బ్లాస్ట్ గా నిలిచింది.
మరి ఇదే రవి కె చంద్రన్ పవన్ పై చేసిన క్రేజీ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టడమే స్టైల్ తో పుట్టాడని తన 40 ఏళ్ల కెరీర్ లో పవన్ లాంటి స్టైల్, ఆరా ఉన్న నటుణ్ని తాను చూడలేదని తెలిపారు. తాను హృతిక్, అమీర్ ఖాన్ ఇంకా ఎంతోమంది స్టార్స్ తో కలిసి వర్క్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్, ఆరా కెమెరా ముందు కానీ ఆఫ్ లైన్ లో అయినా తాను సింపుల్ డ్రెస్ వేసిన అంతెందుకు లుంగీ కట్టినా కూడా ఆ అరా పవన్ కే సొంతం అంటూ క్రేజీ స్టేట్మెంట్ పవన్ కి ఇచ్చేసారు. దీనితో తన పోస్ట్ అండ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
He looked too cool in this last sequence .. born with style @PawanKalyan sir #OG #OGBlockbuster pic.twitter.com/aRHpBgKhtm
— ravi k. chandran (@dop007) September 26, 2025