పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజి’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కట్ అల్ట్రా స్టైలిష్‌గా కట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా పవన్ లుక్స్, ఎలివేషన్స్, ఆయన చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఇక ఈ ట్రైలర్‌లో ఓజస్ గంభీర పాత్రలో పవన్‌ను చూసిన అభిమానులకు చాలా కాలం తర్వాత ఆకలి తీరిందని అంటున్నారు.
గతంలో పవన్‌ను ఇంత స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా ‘పంజా’ చిత్రంలో చూశాం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తరహా యుఫోరియా కనిపించిందని అభిమానులు సంబరపడుతున్నారు. పవన్‌ను వింటేజ్ లుక్స్‌తో పాటు యాక్షన్ మూడ్‌లోకి సుజీత్ తీసుకెళ్లిన విధానం అదిరిపోయిందని వారు అంటున్నారు.
ఇక ఈ సినిమా ప్రీమియర్స్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఓజస్ గంభీర ఊచకోత ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా మారనున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.