ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం AA22xA6 పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్, అట్లీ ఇండియన్ సినిమా రికార్డులపై కన్నేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఇటీవల ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్‌లో అబు దాబిలోని లీవా ఎడారిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పోటీలో ముందున్నట్లు తెలుస్తోంది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ టీమ్ సభ్యులు టాలీవుడ్లో అల్లు అర్జున్, అట్లీ, నాని, శ్రద్ధా కపూర్, అల్లు అరవింద్, నాగవంశీతో సమావేశమయ్యారు. వారి చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తంలో డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్కేల్ ప్రాజెక్ట్‌కి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.