తెలుగు సినిమా డెలివర్ చేసిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రాల్లో “మిరాయ్” కూడా ఒకటి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అలాగే యువ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్లతో దుమ్ము లేపుతుంది. మరి ఈ సినిమా మొత్తం 5 రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకోగా ఈ ఐదు రోజుల్లో మిరాయ్ 100 కోట్ల మార్క్ ని అందుకొని దుమ్ము లేపింది.
ఇక ఇంతే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మరో సెన్సేషనల్ మైల్ స్టోన్ 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని కూడా ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది. దీనితో వసూళ్ల పరంగా మాత్రం మిరాయ్ తో మరోసారి తేజ సజ్జ తన కెరీర్లో రెండో 100 కోట్ల సినిమా యాడ్ చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.