పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ నెలకొల్పుకున్న ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ నటి పామ్.. అదే ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తనపై సాంగ్ పలు విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా కోసం ఈ యంగ్ బ్యూటీ ప్రమోషన్స్ ని ఇపుడు స్టార్ట్ చేసేసింది.
ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ కోసం ఆమె బయటకొచ్చి ప్రింట్ అండ్ వెబ్ మీడియా లకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం చేసింది. దీనితో ఇక నుంచి ఓజి ప్రమోషన్స్ మొదలు అని చెప్పొచ్చు. ఇక ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ ఉంటాయో లేదో అనేది ఇపుడు చూడాలి. అసలే ఇమ్రాన్ హష్మీ విషయంలో అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. హిందీలో ఏమన్నా చేస్తారో లేదో చూడాలి.