అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కీలక షెడ్యూల్ ను హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో అఖిల్ పై ఇంట్రో సన్నివేశాలను ఘాట్ చేస్తారట. అన్నట్టు ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ని తీసుకొవాలని చూస్తున్నారు.
కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.