ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి గన్స్ ఎన్ రోసెస్ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఓజి వర్సెస్ ఓమి గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ పాట రానున్నట్లు ఈ పాట వింటే అర్థమవుతుంది. ఇక ఈ పాటలో ఓజి వేట ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో సాలిడ్ లైన్స్‌తో నెరేట్ చేశారు. అంతేగాక, థమన్ అందించిన ట్యూన్స్‌తో సౌండ్ బాక్సులు బద్ధలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పాటను బిగ్ స్క్రీన్‌పై చూడటం కాదు.. సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాతో ఓజి చేయబోయే ఊచకోతకు అందరూ సిద్ధం కావాల్సిందే అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version