‘మిరాయ్’, ‘హను మాన్’ సంగీత దర్శకుడు ఎమోషనల్ వీడియో!

Mirai Movie

ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర ఆయా చిత్రాల తాలూకా సంగీతం పాటలు ఏ రీతిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సంగీతంలో కూడా వినూత్నత మరియు ఇతిహాస అంశాలపై ఇస్తున్న గీతాలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి సంగీత గీతాలతో అలరించిన సంగీత దర్శకుల్లో గౌర హరి కూడా ఒకరు.

సంచలన విజయ చిత్రం హను మాన్ కి తాను ఇచ్చిన సంగీతం పెద్ద ప్లస్ అయ్యింది. దీనితో తన తర్వాత చిత్రం మిరాయ్ కి కూడా అంతకు మించిన స్కోర్ ని తాను ఇచ్చినట్టు ట్రైలర్, టీజర్ చూస్తే అర్ధం అయ్యింది. ఇక థియేటర్స్ లో సినిమా విడుదల అయ్యాక మాత్రం గౌర హరి పనితనంకి మార్కులు గట్టిగా వచ్చాయి.

మరి ఈ రెస్పాన్స్ తో గౌర హరి చాలా ఎమోషనల్ అయ్యిపోయి ఓ వీడియో వదిలారు. తనకి ఈ అవకాశం ఇచ్చిన కార్తీక్ ఘట్టమనేనికి జీవితాంతం ఋణపడి ఉంటానని తెలిపారు. తాను ఎన్నో ఏళ్ళు సినిమా కోసం కష్టపడ్డారు అని తాను చూపించిన విజువల్స్ బట్టే నా సంగీతం ఇంత గొప్పగా వచ్చింది అని తెలిపారు. అలాగే తేజ సజ్జ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

హను మాన్ హిట్ తర్వాత మిరాయ్ కి తాను కరెక్ట్ అని నమ్మి పరిచయం చేసింది తేజ సజ్జ అని తాను తెలిపారు. అలాగే ఈ సినిమా నిర్మాతకి కూడా ధన్యవాదాలు తెలిపి ఈ వీడియోలో చాలా ఎమోషనల్ అయ్యారు. చివరిగా మిరాయ్ ని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపి ముగించారు. దీనితో తన వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version