క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో

ఇంకొన్ని రోజుల్లో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ తుఫాన్ రాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సినిమా “ఓజి” పై ఇప్పుడు ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. దీనితో ఓజి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఓజి ఫ్యాన్స్ కి ఇపుడు ఒక ఊహించని క్రేజీ క్లిక్ తో సంగీత దర్శకుడు థమన్ మ్యాడ్ సర్ప్రైజ్ అందించాడు.

పవన్ కళ్యాణ్, సుజీత్ ఇంకా తాను కలిసి ఉన్న ఒక హ్యాపీ మూమెంట్ పిక్ ని షేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. మధ్యలో పవన్ ఇద్దరి ఇద్దరి భుజాలపై చెయ్యి వేసి దిగిన పిక్, పైగా అందులో పవన్ ఓజి లోగో ఉన్న హూడీ వేసుకొని కనిపించడం ఇపుడు ఫ్యాన్స్ ని మరింత కేజ్రీగా మార్చేసింది. ఇక దీనిపై థమన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ పోస్ట్ చేసి ఎమోషనల్ ఎమోజి కూడా పెట్టాడు. మొత్తానికి మాత్రం ఈ సర్ప్రైజ్ పిక్ తో పవన్ ఫ్యాన్స్ కి డే ఫుల్ ఫిల్ అయ్యిందని చెప్పొచ్చు.

Exit mobile version