తాజాగా మన తెలుగు సినిమా డెలివర్ చేసిన భారీ హిట్ చిత్రమే “మిరాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ లో భాగంగా మేకర్స్ పెట్టిన ఈవెంట్ లో తేజ సజ్జ అలాగే మనోజ్ డార్లింగ్ హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభాస్ గారు కుర్రోళ్లని చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారని అలానే తమ మిరాయ్ కోసం వాయిస్ ఓవర్ కోసం అడిగినపుడు ఓకే చెప్పారని తన వల్ల సినిమాకి మరింత వెయిట్ వచ్చిందని తేజ తెలిపాడు. అలాగే దీనిపైనే మంచు మనోజ్ మాట్లాడుతూ ప్రభాస్ వాయిస్ ఓవర్ కి థియేటర్స్ లో దుమ్ము లేచిపోతుంది అని డార్లింగ్ తమ అన్నదమ్ములు ఇద్దరి కోసం నిలబడ్డాడు అని కన్నప్ప, మిరాయ్ సినిమాలకి ప్రభాస్ ఇచ్చిన సహకారంపై ఆనందం వ్యక్తం చేసి థాంక్స్ తెలిపాడు.