వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’

mirai-machu

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ చిత్రమే “మిరాయ్”. మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా దుమ్ము లేపింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎంత రాబట్టింది అనేది ఇపుడు మేకర్స్ రివీల్ చేశారు. దీనితో మిరాయ్ 27.2 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఇది హను మాన్ ని మించిన భారీ ఓపెనింగ్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక డే 2 కూడా ఆల్రెడీ సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీనితో డే 2 కూడా గట్టి వసూళ్లే వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా మిరాయ్ కూడా భారీ వసూళ్లే ఫైనల్ రన్ లో సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version