‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో

MahaAvithara

ఇటీవల వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో ఒక యానిమేషన్ చిత్రం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎలాంటివో స్టార్ తారాగణం లేకపోయినప్పటికీ ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టిన ఆ చిత్రమే “మహావతార్ నరసింహ”. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా చాలా కాలం తర్వాత ఒక భారీ లాంగ్ రన్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో దుమ్ము లేపింది.

ఇలా మొత్తం 50 రోజులు రన్ ని పూర్తి చేసుకోగా ఎన్నో ఏళ్ళు నుంచి మిస్ అవుతున్న 50 రోజుల రన్ ని అది కూడా రికార్డు స్క్రీన్స్ లో పూర్తి చేసుకోవడం విశేషం. ఇలా మహావతార్ నరసింహ చిత్రం ఏకంగా 200 థియేటర్స్ లో పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటికీ వీటిలో సినిమా స్ట్రాంగ్ రన్ తోనే దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ అయ్యింది.

Exit mobile version