మిరాయ్, కిష్కింధపురి.. లిటిల్ హార్ట్స్ డ్రీమ్ రన్‌ను తొక్కేశాయా…?

మౌళి హీరోగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే మంచి లాభాల బాట పట్టింది.

అయితే, అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన మిరాయ్ మరియు కిష్కింధపురి చిత్రాలు ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతున్నాయి. మంచి రివ్యూలు, భారీ హైప్‌తో ఈ రెండు సినిమాలు శుక్రవారం నుంచే బలమైన ఓపెనింగ్స్ సాధించాయి. వీకెండ్‌లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ‘లిటిల్ హార్ట్స్’ స్పీడ్‌ని తగ్గించే ప్రమాదం ఉంది.

అయినా, ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మౌత్ టాక్ బలంగా ఉండటం, యూత్ దీనికి బాగా కనెక్ట్ కావడం, కాంపిటీషన్ మధ్య కూడా తన దారిలో ముందుకు సాగే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ రెండు సినిమాలను ఎదుర్కొని ఈ లిటిల్ హార్ట్స్ చిత్రం తన డ్రీమ్ రన్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version