బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!

Mirai Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రమే “మిరాయ్”. మంచు మనోజ్ పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేసిన ఈ సినిమా నిన్న ప్రీమియర్స్ నుంచే సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

మరి రిలీజ్ కి ముందు వరకు మంచి బుకింగ్స్ ని కూడా కనబరిచిన ఈ చిత్రం ఎప్పుడైతే యూనానిమస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుందో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ డే 1 బుకింగ్స్ ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. బుక్ మై షోలో అయితే గంటకి 15 వేలకి టికెట్స్ పైగా మొదలై 18 వేలు కూడా క్రాస్ చేసి మిరాయ్ ర్యాంపేజ్ చూపిస్తుంది.

దీనితో డే 1 గట్టి ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version