‘మిరాయ్’ సర్‌ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’మరికొద్ది గంటల్లో వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా సూపర్ యోధుడిగా తేజ కనిపిస్తాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని.. అవి ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తాయని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇందులో ఒకటి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సర్‌ప్రైజ్ కూడా ఉండనుంది. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా ఆరంభంలోనే ప్రభాస్ ట్రీట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందా.. ఆయన ఏ విషయాన్ని నెరేట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version