‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?

OG-Pawan-Klyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి ఓ సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. దీనితో “ఓజి” సినిమా కోసం చూసే వారి సంఖ్య మరింత కనిపిస్తుండగా ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఇపుడు లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

ఆల్రెడీ ఈవెంట్ కి డేట్ గా ఈ సెప్టెంబర్ 20ని మేకర్స్ లాక్ చేసినట్టుగా టాక్ వచ్చింది. అయితే వేదిక ఏంటి ఎక్కడ అనేది మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కానీ దీనిపై లేటెస్ట్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఓజి ప్రీరిలీజ్ మేకర్స్ విశాఖపట్నంలో అత్యంత ఘనంగా చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ అఫీషియల్ క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version