టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!

మన టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ చేస్తున్న చిత్రమే “తెలుసు కదా”. మరి ఈ సినిమా నుంచి టీజర్ ని మేకర్స్ ఇపుడు వదిలారు. అయితే ఈ టీజర్ మంచి ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తో మొదలై రొమాంటిక్ ఎలిమెంట్స్ ని పుష్కలంగా కోరుకునేవారికి ట్రీట్ లా కనిపిస్తుంది.

అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ తో హీరో రోల్ ప్రేమాయణం ఇద్దరిలో ఎవరితో తన లైఫ్ షేర్ చేసుకుంటాడు అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. టీజర్ మొత్తం ఈ ఒక్క సస్పెన్స్ ఫ్యాక్టర్ ని మాత్రం బాగా మైంటైన్ చేశారు. సినిమా టోన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న కెమెరా వర్క్, సంగీతం ఇంప్రెస్ చేసాయి.

అలాగే లీడ్ నటీనటులు మాత్రం తమ నుంచి రొమాంటిక్ షేడ్ ని గట్టిగానే చూపించేలా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే ఈ ముగ్గురి ట్రైయాంగిల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ కి ముగింపు ఎలా ఉంటుందో దర్శకురాలు ఎలా ముగించారో అనేది తెలియాలి అంటే వేచి చూడక తప్పదు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 17న తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version