వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ ట్రైలర్‌కు 3 మిలియన్ వ్యూస్

‘హ్యాపీడేస్, కొత్త బంగారులోకం’ వంటి హిట్‌లతో కెరీర్ ప్రారంభించిన వరుణ్ సందేశ్, లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ ద్వారా మాస్ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మలుపు అవుతుందన్న నమ్మకం ఆయన వ్యక్తం చేశారు.

జాగృతి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తుండగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించిందని.. ఇప్పటివరకు 30 లక్షల మంది వీక్షించారని నిర్మాత బలగం జగదీష్ తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు మంచి మెసేజ్ కూడా అందించేలా సినిమా తెరకెక్కిందని వరుణ్ సందేశ్ అన్నారు. ట్రైలర్‌కు వచ్చిన విశేష స్పందనతో టీం ఉత్సాహంగా ఉందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, రవి వర్మ, బలగం జగదీష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version