గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు

ప్రస్తుతం మెగా కుటుంబం నుంచి ఉన్న అండర్అందరు హీరోలు కూడా తమ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు కొణిదెల కుటుంబం ఇంట ఆనంద సమయం నెలకొంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొణిదెల కొన్నాళ్ల కితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఈ వార్త తర్వాత వారు ఇపుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. నేడు ఉదయం హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ లో ఈ యువ దంపతులు తల్లిదండ్రులు అయ్యారట. దీనితో కొణిదెల కుటుంబానికి మరో వారసుడు వచ్చాడని చెప్పాలి. ఇక ఈ వార్త విన్న అభిమానులు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నారు.

Exit mobile version