కాస్త విరామం తరువాత ఆది పినిశెట్టి చెన్నైలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఒక యాక్షన్ థ్రిల్లర్లో నటించనున్నాడు. ఆది సొంత తమ్ముడైన సత్య ప్రభాస్ దర్శకుడు. రవి రాజా పినిశెట్టి ఈ సినిమాను ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నేడు హైదరాబాద్లో ప్రారంభమయ్యింది. కె రాఘవేంద్ర రావు, డి రామానాయిడు, కె ఎస్ రామారావు మరియు అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు
ఈ సినిమా గురించి రవి రాజా పినిశెట్టి మాట్లాడుతూ నా ఇద్దరు కొడుకులూ ఈ సినిమాపై చూపిస్తున్న నమ్మకమే ఈ సినిమాను నేను నిర్మించడానికి కారణం. ఆది పినిశెట్టి మాట్లాడుతూ “ఇది ఒక వైవిధ్యమైన సినిమా. దీని స్క్రిప్ట్ కోసం నేను నా తమ్ముడు చాలా కష్టపడ్డాం. ఇందులో భావోద్వేగాలు ప్రాధాన పాత్ర పోషిస్తాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాదిస్తుందని ఆశిస్తున్నానని” తెలిపాడు. నిఖిత హీరోయిన్. మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్ర పోషించాడు. శ్యాం, ప్రసన్, ప్రవీణ్ సంగీతం అందిస్తారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోప్రారంభంకానుంది. మొదటి షెడ్యూల్ ను 40రోజులలో ముగిస్తారు