వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్

OG Thaman

ప్రస్తుతం మొత్తం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” సినిమానే అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కలయికలో తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం సెన్సేషనల్ రికార్డ్స్ పెట్టడం ఖాయం అని ఆల్రెడీ టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో సుజీత్ పవన్ తో ప్లాన్ చేసిన పలు క్రేజీ అంశాల్లో జపనీస్ అంశాలు కూడా ఉన్నాయి.

ఫైట్ సీక్వెన్స్ లు కానీ పాటలో కానీ పవన్ టాటూలు ఇలా చాలానే కనిపించాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ కూడా పలు కొత్త రకం సంగీత వాయిద్యాలు పరిచయం చేస్తూ ఓజి కోసం చేస్తున్న హార్డ్ వర్క్ ని చూపిస్తున్నాడు. ఇలా లేటెస్ట్ గా జపనీస్ బీట్స్ ని కంపోజ్ చేస్తున్న వీడియో వదిలాడు. దీనితో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఓజి స్కోర్ విషయంలో మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇలా ఈ వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version