అప్పుడు ‘హనుమాన్’.. ఇప్పుడు ‘మిరాయ్’..!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో హీరో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గతంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రాన్ని కూడా వీరే రిలీజ్ చేశారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మిరాయ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా వారు పూర్తి నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version