టాలీవుడ్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కిష్కంధపురి’ సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హారర్ జోనర్ చిత్రంగా ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో సిగరెట్, మద్యం తాగడం లాంటి సీన్స్ ఒక్కటి కూడా లేదని.. ఈ సినిమాకు ఆరోగ్యపరమైన వార్నింగ్ యాడ్స్ ఏమీ లేవని.. అయినా, సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసిందని వారు చెప్పారు.
కాగా, కేవలం ఫియర్ ఫ్యాక్టర్‌తోనే ఈ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో భయపెట్టే సీన్స్ పిల్లలను భయబ్రాంతులకు చేసేలా ఉంటాయని.. అందుకే ఇది కేవలం పెద్దలకు మాత్రమే అని వారు చెబుతున్నారు. మొత్తానికి కేవలం కంటెంట్‌తోనే A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమాలో సిగరెట్, మద్యం లాంటి అంశాలు లేకపోవడం నిజంగా విశేషం. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.