ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమేషన్ చిత్రంగా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తోంది. యానిమేషన్ చిత్రం అయినప్పటికీ, ఇందులోని గ్రాఫిక్స్, డివోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది.
ఇండియాలో ఒక యానిమేషన్ చిత్రం ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి అని సినీ క్రిటిక్స్ అంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఓ యానిమేషన్ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం ఇదే ప్రథమం.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు వచ్చినా వాటిని తట్టుకుని ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు విషయం కాదు. అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులతో అదిరిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసింది.