తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పలు హిట్ చిత్రాల్లో దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన యాక్షన్ సోషల్ మెసేజ్ డ్రామా ‘స్టాలిన్’ కూడా ఒకటి. మరి మెగాస్టార్ 70వ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీరిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ తో చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి మరో గట్టి ట్రీట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఓజి ఫస్ట్ సింగిల్ సహా పవన్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా గ్లింప్స్ ని యాడ్ చేసినట్టు తెలిపారు. దీనితో స్టాలిన్ థియేటర్స్ లో మెగా అభిమానులకి డబుల్, ట్రిపుల్ ధమాకా అని చెప్పాల్సిందే. ఇక రేపు థియేటర్స్ లో ఆ సందడి ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version