టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కంధపురి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచడంలో ఉపయోగపడ్డాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ జోడీ మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇఫ్పటికే పూర్తవగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పాల్గొంటున్నాడు. ఈ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేసి రిలీజ్‌కు మరింత దగ్గర కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.