ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?

టాలీవుడ్‌లో ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ డేట్‌లు లాక్ చేసుకుని పెట్టుకున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు పలు కారణాలతో తమ రిలీజ్ డేట్‌ను వాయిదా పడుతున్నాయి. అయితే, ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఓ యంగ్ హీరో కొత్త సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది.

‘హను-మాన్’ సినిమాతో నేషన్‌వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో తేజా సజ్జ. ఇక ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా కావడంతో, ఈ చిత్రాన్ని మరింత సమయం తీసుకుని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వెనుక కారణం తెలియాల్సి ఉంది. అయితే, ఈ సినిమా కనుక వాయిదా పడితే, స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’కి లైన్ క్లియర్ అవుతుంది. మరి నిజంగానే మిరాయ్ చిత్రం మళ్లీ వాయిదా పడుతుందా.. అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Exit mobile version