సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాను పీరియాడికల్ ఎపిక్ చిత్రంగా క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ తన పవర్‌ఫుల్ పాత్రతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు.

కాగా, ఈ సినిమాలోని వీక్ రైటింగ్, వీఎఫ్ఎక్స్ కారణంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. అయితే, ఆగస్టు 20 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించారు.

దీంతో సర్‌ప్రైజింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తున్న వీరమల్లును చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Exit mobile version