ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఇక బన్నీ అందరినీ అబ్బురపరుస్తూ ‘జాతర’ సాంగ్‌లో గంగమ్మ తల్లి గెటప్‌లో కనిపించాడు.
ఆ పాటకు థియేటర్లు ఊగిపోయాయి. బన్నీ చేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే, ఇప్పుడు బన్నీ చేసిన ఈ పాటకు మరో స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనదైన స్వాగ్తో స్టెప్పులు వేశాడు. మాల్దీవుల్లో ఓ ఫ్యామిలీ సంగీత్‌లో భాగంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య పుష్ప 2 జాతర సాంగ్‌కు చిందులేశారు.
ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. పుష్ప పాటకు సింహం డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.